Helping Hands | బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అనాథ మహిళ మృతి

బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అనాథ మహిళ మృతి.. కన్నీరు పెట్టిస్తున్న ఇద్దరు కూతుళ్ల దీనస్థితి

మానవత్వం చాటిన జామా మజీద్ కమిటీ.. అంత్యక్రియలకు అండగా నిలిచిన పెద్దలు

ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు భోజనం పెట్టి, స్వగ్రామానికి పంపిన ఘటన

బాన్సువాడ, అక్టోబర్ 30: బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఓ అనాథ మహిళ మృతి చెందిన ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. బిచ్కుంద మండలం కందర్ పల్లికి చెందిన చాంద్ బీ (35) అనే మహిళ కడుపు నొప్పితో గురువారం ఏరియా ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది.

భర్త సలీం అప్పటికే చనిపోవడం, ఇతర బంధువులు ఎవరూ లేకపోవడంతో ఆమె మృతదేహం అనాథగా మిగిలిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, తల్లి శవం పక్కన కూర్చొని తీవ్రంగా ఏడుస్తూ సహాయం కోసం అర్థించారు. ఆ చిన్నారుల దీనస్థితిని చూసిన అక్కడి మానవతావాదులు చలించిపోయారు.

వెంటనే స్పందించి చిన్నారులకు భోజనం పెట్టడంతో పాటు, పట్టణంలోని జామా మజీద్ కమిటీ అధ్యక్షుడు రిజ్వాన్, టీచర్స్ కాలనీ కౌన్సిలర్ అబ్దుల్ ఖలీక్, ఖలీల్ లకు సమాచారం అందించారు. మానవత్వంతో స్పందించిన వారు మృతురాలి అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి, మృతదేహాన్ని వాహనంలో స్వగ్రామమైన కందర్ పల్లికి పంపించారు. వారి మానవతా స్పందన పట్ల స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. Video 👇





Post a Comment

أحدث أقدم