![]() |
| AI Image |
బాన్సువాడ -గాంధారి -హైదరాబాద్ (MGBS) సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 4: బాన్సువాడ, బోర్లం, కోనాపూర్, హన్మాజీపేట, ముదెల్లి, సర్వాపూర్, గౌరారం, గండివెట్ గ్రామాల ప్రజలకు TGSRTC శుభవార్త చెప్పింది.
బాన్సువాడ నుండి కామారెడ్డి మీదుగా హైదరాబాద్ MGBS వరకు కొత్తగా సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు బాన్సువాడ డిపో మేనేజర్ తెలిపారు.
బస్సు టైమింగ్: ప్రతిరోజు ఉదయం 04:30 గంటలకు బాన్సువాడ బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. ఈ సదవకాశాన్ని బాన్సువాడ పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
రూట్ మ్యాప్ వివరాలు:
బాన్సువాడ (0 Km) -> బోర్లం క్యాంప్ ->-ముదెల్లి -> సర్వాపూర్ -> గౌరారం -> గండివెట్ -> గాంధారి -> కామారెడ్డి -> హైదరాబాద్ (MGBS)
దూరం వివరాలు:
- బాన్సువాడ నుండి కామారెడ్డి వరకు (గాంధారి మీదుగా): సుమారు 61 కి.మీ
- కామారెడ్డి నుండి MGBS హైదరాబాద్ వరకు: సుమారు 116 కి.మీ
- మొత్తం దూరం (బాన్సువాడ నుండి MGBS వరకు): సుమారు 177 కి.మీ
ఉదయం 4:30 గంటలకు బయలుదేరితే ఉదయం 9:00 - 9:30 గంటల లోపు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, విద్యార్థులకు, ఆసుపత్రులకు వెళ్లే వారికి ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

إرسال تعليق