Virahath Ali | జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి 

త్వరలో కామారెడ్డిలో AI క్లాసులు

బాన్సువాడ శిక్షణ తరగతులు విజయవంతం

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

బడా పహాడ్ లో ఘన సన్మానం

కామారెడ్డి, అక్టోబర్ 4: రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ పేర్కొన్నారు.

ఆదివారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బడా పహాడ్ దర్గాలో కందూరి నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.



బాన్సువాడ శిక్షణ తరగతులు విజయవంతం:

బాన్సువాడలో తెలంగాణ మీడియా అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు విజయవంతమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా శాఖతో పాటు బాన్సువాడ ప్రెస్ క్లబ్ తక్కువ కాలంలోనే ఈ తరగతులను దిగ్విజయంగా నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి కూడా బాన్సువాడలో జరిగిన శిక్షణ తరగతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక అభివృద్ధి పనులు చేశారని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారని చైర్మన్ మెచ్చుకున్నట్లు విరాహత్ అలీ తెలిపారు.

"ఇక్కడ మరో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటే కూడా ఉండడానికి చైర్మన్ సిద్ధంగా ఉండడం గమనార్హమని అన్నారు. తాను కొన్ని అనివార్య కారణాల వల్ల  ముగింపు రోజు హాజరు కాలేకపోయానని" ఆయన పేర్కొన్నారు.

త్వరలో కామారెడ్డిలో AI క్లాసులు:

త్వరలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా ఉన్న మహిళా జర్నలిస్టులకు హైదరాబాద్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని వెల్లడించారు.

తమ యూనియన్ జర్నలిస్టుల కోసం పని చేస్తుందని, తమ పని తాము చేసుకుంటూ వెళ్తామే తప్ప ప్రచారం చేసుకోమని అన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.

బడా పహాడ్ లో ఘన సన్మానం:

ఈ సందర్భంగా బడా పహాడ్ హాజరత్ షాదుల్ల హుస్సేని దర్గా నిర్వాహకులు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ దంపతులను, జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లతీఫ్, జిల్లా కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఎస్.కె. మొయిన్, చంద్రశేఖర్, ఆబిద్ హుస్సేన్, సీనియర్ జర్నలిస్టులు సాయగౌడ్,పోషీరామ్, వెంకన్న, ఎండి యూనిస్, సలీం అహ్మద్, వీరన్న, భవాని, బర్ల సుధాకర్, సయ్యద్ నబి, ఎంబరి ఆనంద్, హన్మాన్లు, సతీష్, రాజు, వడ్ల సురేష్, సునీల్, సుందర్, గుండుబా శ్రీనివాస్, ఖలీక్, ఇలియాజ్, నజీర్, బాలయ్య, రెడ్ క్రాస్ మెంబర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.









Post a Comment

أحدث أقدم