తులం బంగారం ఇవ్వాల్సిందే - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ డిమాండ్
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్, అక్టోబర్ 11:
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.
నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, పథకం నిలిపివేస్తారనే పుకార్లు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వాలన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తుందని, కనీసం హామీ ఇచ్చిన సమయంలో ఉన్న ధరకే బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నమోదు చేసుకున్న లబ్ధిదారులకు తొందరగా చెక్కులు అందజేయాలని సూచించారు.
మొత్తం 275 మంది లబ్ధిదారులకు రూ.2.75 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నూడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, జగదీష్ కులకర్ణి, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, నాయకులు పంచరెడ్డి శ్యామ్, పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.



إرسال تعليق