MP Shetkar | కోటగల్లి దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ సురేష్ షెట్కార్

బాన్సువాడ కోటగల్లి దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ సురేష్ షెట్కార్

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం - అమ్మవారికి ప్రత్యేక పూజలు

బాన్సువాడ, 18 అక్టోబర్: జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ ఆదివారం బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణం జై భవాని, జై జై భవాని నినాదాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్ర శేఖర్, పత్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم