Patel's Jayanthi | జాతీయ ఐక్యతకు కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ - ఎమ్మెల్యే ధన్ పాల్


జాతీయ ఐక్యతకు కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ - ఎమ్మెల్యే ధన్ పాల్

వర్ని చౌరస్తాలో పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే

ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ విలీనానికి పటేల్ కీలక పాత్ర - ఎమ్మెల్యే

తాజ్/నిజామాబాద్, అక్టోబర్ 31: జాతీయ ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ గారితో కలిసి ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 562 సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ లో ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఘనమైన నివాళి అందించారన్నారు.

నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలో ఆపరేషన్ పోలో ప్రారంభించి, సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు ప్రకటించడంతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైందన్నారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, జగదీష్ కులకర్ణి, మల్కాయి మహేందర్, మఠం పవన్, న్యాలం సునీత రాజు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم