నిజామాబాద్ టౌన్ సీఐ బి. శ్రీనివాస్‌కు ఘన సన్మానం
రహ్మత్ మెడికల్ యాజమాన్యం ఆధ్వర్యంలో శాలువతో సత్కారం
తాజ్ / నిజామాబాద్: నిజామాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్‌ను రహ్మత్ మెడికల్ యాజమాన్యం ఈరోజు ఘనంగా సన్మానించింది. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ సత్కారం చేపట్టారు.
రహ్మత్ మెడికల్ నిర్వాహకులు బాసిత్, అజీజ్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూల బొకే అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజల కోసం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సీఐ బి. శ్రీనివాస్ స్పందిస్తూ అందరి సహకారంతో నేర నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు.

إرسال تعليق