బాన్సువాడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - రూ.50,280 స్వాధీనం
అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్ట్
బాన్సువాడ, అక్టోబర్ 25: తాడ్కోల్ శివారులోని అటవీ ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు బాన్సువాడ పోలీసులు దాడి నిర్వహించారు.
పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకొని వారి వద్ద నుండి రూ. 50,280 నగదు, 5 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుల శ్రీధర్ తెలిపారు.
కాగా పేకాట ఆడుతున్న వారు మొత్తం 8 మంది ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఐదుగురు పారిపోయినట్లు సమాచారం. పారిపోయిన వారిలో బడా లీడర్లు ఉన్నట్లు తెలిసింది. సెల్ ఫోన్లు ఐదు లభించగా, ముగ్గురిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. పారిపోయిన వారిపై కేసు నమోదు చేస్తారా లేదా వేచి చూడాలి.

إرسال تعليق