Attack on Women | అత్తపై అల్లుడి దాడి కలకలం

అత్తపై అల్లుడి దాడి కలకలం - బీర్కూర్ లో ఘటన

భార్యను వేధిస్తున్నాడని నిలదీసినందుకు కర్రతో దాడి

బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు 

బీర్కూర్, అక్టోబర్ 25 : కుటుంబ తగాదాల నేపథ్యంలో అత్తపై అల్లుడు దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో శనివారం చోటుచేసుకుంది.

బీర్కూర్ కు చెందిన సతీష్ తన భార్య సుమలతను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న సుమలత తల్లి పోశవ్వ శనివారం కూతురును తీసుకెళ్లేందుకు బీర్కూర్ కు వచ్చింది.

అల్లుడి వేధింపుల గురించి పోశవ్వ ప్రశ్నించగా, ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఆగ్రహంతో సతీష్ కర్రతో అత్త తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

గాయపడిన పోశవ్వను స్థానికులు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన తల్లిపై భర్త దాడి చేశాడంటూ సుమలత బీర్కూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم