ఫ్లడ్ లైట్ల కాంతుల్లో బాన్సువాడ మినీ స్టేడియం జిగేల్ - తొలి నైట్ క్రికెట్ టోర్నీకి అదిరే ఆరంభం
థ్రిల్లర్ మ్యాచ్ లో ప్రెస్ vs పోలీస్ - రెండు సూపర్ ఓవర్లు, చివరికి ప్రెస్ పై చేయి!
బాన్సువాడ, అక్టోబర్ 24 (స్పోర్ట్స్ బ్యూరో): బాన్సువాడ చరిత్రలోనే మొదటిసారి... మినీ స్టేడియం ఫ్లడ్ లైట్ల వెలుగులో పగటిలా మారింది. ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో శనివారం రాత్రి ప్రారంభమైన నైట్ క్రికెట్ టోర్నమెంట్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఓపెనింగ్ మ్యాచ్ కే హై ఓల్టేజ్ డ్రామా నడిచింది. ప్రెస్ వర్సెస్ పోలీస్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా ఫైనల్ రేంజ్ లో ఉత్కంఠ.
కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాజ్, కాసుల రోహిత్, కౌన్సిలర్ ఎం.ఏ హకీం కేక్ కట్ చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.
మ్యాచ్ హైలైట్స్:
టాస్ గెలిచిన పోలీస్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుని 7 ఓవర్లలో 70 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ప్రెస్ టీమ్ కూడా 7 ఓవర్లలో 70 రన్స్ చేయడంతో మ్యాచ్ టై.
ఫస్ట్ సూపర్ ఓవర్ - ప్రెస్ 4 బంతుల్లో 2 వికెట్లు, పోలీస్ 2 బంతుల్లో 2 వికెట్లు - మళ్లీ టై!
సెకండ్ సూపర్ ఓవర్ - పోలీస్ 2 బంతుల్లో ఆలౌట్, ప్రెస్ మొదటి బంతికే 1 రన్ కొట్టి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.
హీరో ఆఫ్ ది మ్యాచ్:
నమస్తే తెలంగాణ రిపోర్టర్ వై. ఆనంద్ - హ్యాట్రిక్ వికెట్లతో (3 వికెట్లు), బ్యాట్ తో 25 రన్స్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా చెలరేగాడు. అతడికి A1 FOOTWEAR, BANSWADA (Near Police Station) వారు స్పాన్సర్ చేసిన స్పోర్ట్స్ షూస్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బహుకరించారు.
ప్రెస్ టీమ్: అబ్దుల్ ఖాలిక్ (కెప్టెన్ ), ఆనంద్ (వైస్ కెప్టెన్ ), నబీ, ఫాల్గున్, సతీష్, చందు, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి.
సీనియర్ జర్నలిస్టులు మొయినుద్దీన్, శ్రీకాంత్ రెడ్డి, అహ్మద్, యూనుస్, సలీం, జర్నలిస్ట్ లు నజీర్, మహేష్, పెరిమల్, రవీందర్ గౌడ్, సలా వుద్దీన్ విజేతలకు అభినందనలు తెలిపారు.
టోర్నీ డీటెయిల్స్:
నిర్వాహకులు ఖుద్దూస్, ఆఫ్రోజ్, లాలా, ఇమ్రాన్, ఖాలేద్, ఏక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం...
విజేతకు రూ.20,000, రన్నర్ కు రూ.10,000 క్యాష్ ప్రైజ్
ఒక టీమ్ కు 8 మంది ప్లేయర్స్, 7 ఓవర్ల మ్యాచ్, షార్ట్ బౌండరీ. మొత్తం 36 టీమ్స్ పాల్గొన్నాయి.
గ్రామీణ టాలెంట్ ను వెలికి తీసి, ఫిట్ నెస్, స్పోర్ట్స్ స్పిరిట్ పెంచడమే లక్ష్యంగా ఈ నైట్ టోర్నీని ప్లాన్ చేశామని నిర్వాహకులు చెప్పారు. బాన్సువాడలో ఇక ప్రతి రాత్రి క్రికెట్ జోష్ మామూలుగా ఉండదు!








إرسال تعليق