Free Dental Camp | 100 మంది విద్యార్థులకు దంత పరీక్షలు

సదాశివనగర్ మండలం వజ్జేపల్లి పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

100 మంది విద్యార్థులకు దంత పరీక్షలు - IDA కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శిబిరం

సదాశివనగర్, అక్టోబర్ 25: సదాశివనగర్ మండలం వజ్జేపల్లి పాఠశాలలో ఈ రోజు IDA కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు చేసి తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా. వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరగా IDA కామారెడ్డి ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

అలాగే శిబిరంలో పాల్గొన్న దంత వైద్యులు తమ NEHS empanelled దంత వైద్యశాలలలో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల ద్వారా దంత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సదుపాయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

IDA రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. M. మల్లికార్జున్, IDA కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డా. అచ్చుకట్ల జీవన్, కార్యదర్శి డా. అభిషేక్, దంత వైద్యులు డా. అనిల్, డా. ప్రవీణ్, డా. నాగరాజు, డా. సౌమ్య, డా. సందీప్, ఆరోగ్యశ్రీ DM శశాంక్ రెడ్డి, అల్లావుద్దీన్, సుధీర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم