RDO Meeting | అన్ని పార్టీల ప్రతినిధులతో SIR 2026పై సమీక్ష

బాన్సువాడలో ERO సమావేశం - అన్ని పార్టీల ప్రతినిధులతో SIR 2026పై సమీక్ష

అక్టోబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల అవకాశం

బాన్సువాడ, అక్టోబర్ 14: బాన్సువాడ RDO కార్యాలయంలో ERO, RDO రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో SSR 2026 (Special Summary Revision) కి సంబంధించి కాన్స్టెన్సీ ఇంచార్జీలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ రాజా నరేందర్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, డిప్యూటీ తహసీల్దార్ కాపర్తి సంగమేశ్వర్, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. BRS, కాంగ్రెస్, BJP, CPM, CPI, TDP, MIM తదితర పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున అబ్దుల్ ఖాలేక్, లైయేఖ్ MIM, శంషాద్దీన్ TDP, BRS పార్టీ తరపున రమేష్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో వెల్లడించిన ముఖ్యాంశాలు:

బాన్సువాడ నియోజకవర్గంలో నోటీసులు జారీ చేసి పెండింగ్‌లో ఉన్నవి మొత్తం 1283.

మండలాల వారీగా పెండింగ్ వివరాలు:

పోతంగల్ - 37, పోతంగల్ (A) - 16, కోటగిరి - 55, కోటగిరి (A) - 34, చందూర్ - 3, వర్ని - 42, వర్ని (A) - 21, నసురుల్లాబాద్ (A) - 5, బీర్కూర్ - 96 (BLO నోటీసులు ఇవ్వనివి 12), బాన్సువాడ రూరల్ - 110, బాన్సువాడ అర్బన్ - 864. మొత్తం 1283.

అలాగే ఫారం 6, 7, 8 కింద ఇప్పటివరకు 3266 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.

కొత్త ఓటర్ నమోదు కోసం ఫారం-6 పై స్పెషల్ డ్రైవ్ కింద అక్టోబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల అవకాశం కల్పించినట్లు RDO తెలిపారు. 16వ తేదీ లోపు ఫారం-6 ద్వారా అప్లై చేసుకున్న వారి పేర్లు ఫైనల్ ఓటర్ డ్రాఫ్ట్ జాబితాలో వస్తాయని స్పష్టం చేశారు.

Post a Comment

أحدث أقدم