Collector | 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు : కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, అక్టోబర్ 14: కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.

బుధవారం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2026 (SSR-2026) అమలుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి నోటీసుల జారీ, విచారణల పురోగతిని సమీక్షించి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఈ ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హత సాధించిన వారు నిర్ణీత ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, సవరణలకు సంబంధించి అందిన అభ్యర్థనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, ఎన్నికల అధికారి రాజేశ్వర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم