Rice Millers Fraud | ప్రభుత్వ ధాన్యం మాయం.. రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు!


ప్రభుత్వ ధాన్యం మాయం.. రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు!

సీఐడీ దూకుడుతో జిల్లాలోని మిల్లర్లు అజ్ఞాతంలోకి

10 కోట్ల కుంభకోణం - సన్నాలకు బదులు దొడ్డు బియ్యం సరఫరా

తెలంగాణ డైలీ న్యూస్ /నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంలో రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీఐడీ అధికారుల దూకుడు చూసి మిల్లర్లంతా అలర్ట్ అయ్యారు.

జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మేసి, సన్నాలకు బదులు దొడ్డు రకం బియ్యాన్ని భారత ఆహార సంస్థ (FCI) కి అంటగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అధికారులు మిల్లర్లతో చేతులు కలిపినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.

రంగంలోకి దిగిన అధికారులు జిల్లాలోని 6 ప్రముఖ రైస్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 667 మెట్రిక్ టన్నుల సన్నాలకు బదులుగా దొడ్డు బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు గుర్తించారు. సుమారు రూ. 10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు మిల్లర్లను అధికారులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు మిల్లర్లు పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న వారి కోసం సీఐడీ అధికారులు గాలిస్తున్నారు.

దొడ్డు బియ్యం పాస్ అయ్యేందుకు సహకరించిన అధికారులను గుర్తించేందుకు అరెస్ట్ చేసిన మిల్లర్లను కస్టడీలోకి తీసుకొని విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

70 మంది అండర్ గ్రౌండ్:

సీఐడీ అధికారుల దూకుడుతో జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు వణికిపోతున్నారు. మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందన్న సమాచారం లీక్ కావడంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన 70 మందికి పైగా మిల్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మిల్లులకు తాళాలు వేసి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఏ క్షణంలో ఏ మిల్లుపై దాడి చేస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియక భయంతో వణికిపోతున్నారు.

లారీకి 5 లక్షల దందా:

నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్ లో 15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు మిల్లులకు కేటాయించారు. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రూపంలో తిరిగి ఇవ్వాలి. కామన్ బియ్యం ఇస్తామని కొందరు మిల్లర్లు అనుమతి తీసుకున్నారు. ఒక్కో మిల్లు 60 నుంచి 100 లారీల బియ్యం సన్నాలకు బదులు దొడ్డు రకం ఇచ్చారు. ఇలా ఒక్కో లారీ వెనుక మూడు నుంచి 5 లక్షలు సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది.

నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్ లో 15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రూపంలో తిరిగి ఇవ్వాలి. అయితే ఒక్కో మిల్లు 60 నుంచి 100 లారీల బియ్యం సన్నాలకు బదులు దొడ్డు రకం ఇచ్చి, ఒక్కో లారీ వెనుక లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

మొత్తానికి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి సూత్రధారులు, పాత్రధారుల భరతం పట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



Post a Comment

أحدث أقدم