Scholorships | ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు శ్రీరామ్ ఫైనాన్స్ స్కాలర్‌షిప్‌లు

ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు శ్రీరామ్ ఫైనాన్స్ స్కాలర్‌షిప్‌లు

ఏడాదికి రూ. 4 వేల చొప్పున సాయం - విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాట

బాన్సువాడ, అక్టోబర్ 29:విద్యార్థులను ప్రోత్సహించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే లక్ష్యంతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ బాన్సువాడ బ్రాంచి ఆధ్వర్యంలో గురువారం స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

బాన్సువాడ పట్టణంలోని సింధు విద్యాలయం, హస్గుల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 20 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ పత్రాలను సంస్థ రీజనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా "యువ మేధస్సుకు ప్రోత్సాహం - ఉజ్వల భవిష్యత్తుకు బాట" అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 4 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ కలెక్షన్ మేనేజర్ దుర్గ ప్రసాద్‌తో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم