SP's Inspection | సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి - ఎస్పీ రాజేష్ చంద్ర

బీబీపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

సిబ్బంది విధులు, పెండింగ్ కేసులపై సమీక్ష - దొంగతనాల నివారణకు పటిష్ట చర్యలు ఆదేశం

సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి - ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, 15 అక్టోబర్: కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బీబీపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన రోల్ కాల్ వివరాలు, సిబ్బందికి కేటాయించిన విధులు, బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో దొంగతనాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, రాత్రి వేళల్లో నిరంతర గస్తీ నిర్వహిస్తూ రౌడీషీటర్లు, పాత నేరస్థులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు.

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, సత్వర న్యాయం అందించాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆన్ లైన్ మోసాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండేలా సూచించాలన్నారు. డయల్ 112 ద్వారా అందే అత్యవసర కాల్స్ పై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో బీబీపేట ఎస్హెచ్ఓ నవీన్ చంద్రతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.







Post a Comment

أحدث أقدم