సీఎం ఇల్లు ముట్టడికి వెళ్తున్న ఉద్యమకారుల అరెస్ట్
హామీలు నెరవేర్చాలని డిమాండ్ - బాన్సువాడలో ఉద్యమకారుల ఆందోళన
బాన్సువాడ, అక్టోబర్ 26: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి వెళ్తున్న బాన్సువాడ ఉద్యమకారులను బాన్సువాడ పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటలకే తమను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు ఉద్యమకారులు ఆరోపించారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి:
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ. 25,000 పెన్షన్, గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని వారు విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉడుత గంగాధర్, గంజి చందు, భాస్కర్ గౌడ్, కల్వ శ్యామ్, ఎదుబల్లి కృష్ణ, అగ్లవే దత్తు, గంగారాం, పల్లికొండ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق