Venkatswamy Jayanthi | బోర్లం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా కాకా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

బోర్లం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా కాకా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

బోర్లం, అక్టోబర్ 5: ఈరోజు బోర్లం ప్రాథమిక పాఠశాలలో మాజీ కేంద్ర మంత్రి, దళిత ఉద్ధారకుడు కాకా గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా విద్యార్థులకు మాల సంఘం ఆధ్వర్యంలో పెన్నులు, నోటు బుక్కులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాల సంఘం వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ..

"మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి అన్ని వర్గాల పేదలకు, కార్మికులకు మెరుగైన జీవన సదుపాయాలు కల్పించడం కోసం విశేష కృషి చేశారు. కార్మికుల కోసం PF, గ్రాట్యుటీ, పెన్షన్ కోసం ఎనలేని కృషి చేశారు. ఇళ్లు లేని 70 వేల నుండి 80 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గుడిసెలు వేయించారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, సింగరేణి కార్మికుల కోసం నిరంతరం శ్రమించారు. బలహీన వర్గాల కోసం 1973లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ మరియు కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక పాత్ర వహించారు. పేదల పక్షాన, కార్మికుల కోసం నిలిచి పోరాటం చేసిన మహనీయుడు కాకా" అని కొనియాడారు.

విద్యార్థులు బాగా చదివి సమాజం కోసం పని చేసే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాల సంఘం గ్రామ అధ్యక్షులు కొత్తపల్లి సాయిలు, AMC మాజీ చైర్మన్ నర్సింలు, డాక్టర్ సాయిలు, వార్డు మెంబర్ కమ్మరి గంగారాం, బలరాం, మన్నే గంగారాం, భాగయ్య, బొబ్బులిపులి సాయిలు, ప్రధానోపాధ్యాయులు సాయిరాం, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم