🔴 బ్రేకింగ్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్ నినో ఎఫెక్ట్ - 800 ఎకరాల్లో ఎండిన వరి పంటలు
కామారెడ్డి / నిజామాబాద్, అక్టోబర్ 5:
ఉమ్మడి జిల్లాలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
📊 TGDPS లెక్కల ప్రకారం:
> జిల్లా సగటు వర్షపాతం ఈరోజు 0.0 మి.మీ - సాధారణం 2.5 మి.మీ కాగా -100% లోటు
> అక్టోబర్ 4 ఉ.8:30 నుండి అక్టోబర్ 5 ఉ.8:30 వరకు జిల్లాలో ఎక్కడా వర్షం లేదు
> సీజన్ మొత్తం: వాస్తవం 837.9 మి.మీ| సాధారణం 819.3 మి.మీ| +2.0% మాత్రమే - అంటే సీజన్ సాధారణమే అయినా ప్రస్తుతం పూర్తి వర్షాభావం
🌡️ పగటి ఉష్ణోగ్రతలు 36°C దాటాయ్:
- బీర్కూర్ - 36.9°C
- బాన్సువాడ కొల్లూర్ - 36.7°C
- పిట్లం - 36.5°C
- బిచ్కుంద - 35.2°C
అక్టోబర్ లో ఉండాల్సిన చల్లదనం పోయి మళ్ళీ భానుడి భగభగలు.
🚨 వర్ని మండలంలో 800 ఎకరాల్లో పంట ఎండిపోయింది:
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్, శాంరావు తండా, చెలక తండా, చింతలపేట్ తండాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి.
🌾 బాన్సువాడలోనూ ఇదే పరిస్థితి - 500 ఎకరాల్లో ఎండుముఖం:
నిజాంసాగర్ పరివాహకం కిందకు రాని గట్టుమీది గ్రామాల్లో 500 ఎకరాల్లో వరి ఎండుముఖం పట్టింది.
హన్మాజీపేట, అవాజీపల్లి, కాద్లాఫూర్, కోనాపూర్, సోమ్లానాయక్ తండా, పులిగుండం తండా, సంగోజీపేట్* శివార్లలో వర్షాధార పంటలన్నీ ఎండిపోతున్నాయి. మరో వారం ఇలాగే ఉంటే 800 ఎకరాల్లో పంట నష్టం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.
🗣️ రైతుల ఆవేదన:
"6 ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టాను, అడ్వాన్సు కూడా చెల్లించాను, తీవ్రంగా నష్టపోయాను" అని ఓ రైతు, "ప్రతి ఏటా మొక్కజొన్న వేసేవాడిని, ఈసారి వరి వేశాను, 4 ఎకరాల్లో రూ.50 వేలు పెట్టుబడి మొత్తం ఎండిపోయింది" మరో రైతు, "30 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది, ఈసారి 20 క్వింటాళ్లు కూడా రాదు, కంకులు చిన్నబోయాయి" అని ఇంకో రైతు పేర్కొన్నారు.

إرسال تعليق