ఓట్ బచావో - దేశ్ బచావో కార్యక్రమానికి కామారెడ్డి కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు
షబ్బీర్ అలీ నేతృత్వంలో ఢిల్లీకి కామారెడ్డి కాంగ్రెస్ దళం - తెలంగాణ భవన్లో సమావేశం
రాహుల్ గాంధీ పిలుపుతో రామ్లీలా మైదానానికి కాంగ్రెస్ నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
కామారెడ్డి, నవంబర్ 1: ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఆదివారం ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న “ఓట్ బచావో - దేశ్ బచావో” కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.

ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ నేతృత్వం, పిలుపు మేరకు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి అక్కడి నుంచి రామ్లీలా మైదానానికి బయలుదేరారు.
ఓటు హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల తమ సంఘీభావాన్ని తెలిపారు.



إرسال تعليق