బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి - సీపీఐ నేత దుబాస్ రాములు డిమాండ్
ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు - కేంద్రానికి నివేదిక ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి - ప్రభుత్వానికి విజ్ఞప్తి
బాన్సువాడ, నవంబర్ 3: బాన్సువాడ పట్టణంలోని సీపీఐ కార్యాలయం పక్కన గల నాయి బ్రాహ్మణ ఫంక్షన్ హాల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీపీఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా సహాయ కార్యదర్శి దుబాస్ రాములు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల కరువు తీవ్రంగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, కేంద్రానికి నివేదిక అందించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బాన్సువాడ మున్సిపాలిటీలో వర్తింపజేసి, గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు చెన్నంగారి సురేష్, తోట శ్రీనివాస్, సాయిలు, ఖాదర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق