Ration Cards Distribute | బాన్సువాడలో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

బాన్సువాడలో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

వెంటనే కార్డులు తీసుకోవాలని ప్రజలకు షాదీఖానా చైర్మన్ విజ్ఞప్తి

రుద్రంగి అశోక్ /బాన్సువాడ : 

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పులు చేస్తూ డిజిటల్ రేషన్ కార్డులను తయారు చేసి పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. అయితే కొన్ని కారణాల వల్ల బాన్సువాడలో డిజిటల్ కార్డుల పంపిణీ జరగలేదు.

రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. మైనారిటీ షాదీఖానాలో కూడా కార్డులు పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా షాదీఖానా చైర్మన్ హఫీజ్ అబ్దుల్ వహాబ్, కౌన్సిలర్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ ముజాహిద్, ఫెరోజ్, లైక్  సందర్శించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ తమ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల నుంచి కొత్త డిజిటల్ కార్డులను తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖయ్యూం నిషాద్, యూసుఫ్, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Video 👇




Post a Comment

أحدث أقدم