వార్డు 17లో తక్కువ వోల్టేజీ సమస్య - ఎన్పీడీసీఎల్ ఏఈ బృందం పరిశీలన
ఏళ్లుగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యపై స్పందించిన అధికారులు - త్వరలో పరిష్కారానికి హామీ
ఏఐఎంఐఎం నేత అబ్దుల్ లాయక్ ఆధ్వర్యంలో అధికారులతో వార్డు పర్యటన
బాన్సువాడ, నవంబర్ 2: బాన్సువాడ మున్సిపాలిటీ 17వ వార్డులో ఏళ్లుగా వేధిస్తున్న తక్కువ వోల్టేజీ సమస్యపై నేడు అధికారులు స్పందించారు.
వార్డు ప్రజల విజ్ఞప్తి మేరకు NPDCL ఏఈ సంతోష్ కుమార్ తన బృందంతో, లైన్ మెన్ పోశెట్టితో కలిసి వార్డు 17లో పర్యటించారు. ఈ సందర్భంగా లో వోల్టేజీ సమస్యను పరిశీలించి, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ఏఐఎంఐఎం వార్డు ప్రతినిధి, కౌన్సిలర్ భర్త అబ్దుల్ లాయక్, కాంగ్రెస్ కో-ఆప్షన్ సభ్యులు మజ్జు, అస్లం, అంజద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి కృషి కొనసాగుతుందని వారు తెలిపారు.

إرسال تعليق