Food Safety Officer's Raid | అనుమతిలేని రంగులు వాడితే కఠిన చర్యలు - ఆహార భద్రత అధికారి విక్రమ్ హెచ్చరిక

రెస్టారెంట్లలో కృత్రిమ రంగుల వినియోగంపై ఆహార భద్రత శాఖ దాడులు

కామారెడ్డిలో అల్ సుభాన్ రెస్టారెంట్‌లో 15 కిలోల నిల్వ ఆహారం ధ్వంసం - నమూనాల సేకరణ

అనుమతిలేని రంగులు వాడితే కఠిన చర్యలు - ఆహార భద్రత అధికారి విక్రమ్ హెచ్చరిక

కామారెడ్డి, నవంబర్ 2: కామారెడ్డి జిల్లాలో ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఆహార భద్రతా శాఖ సోమవారం రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించింది.

కామారెడ్డి పట్టణంలోని అల్ సుభాన్ రెస్టారెంట్‌ను ఆహార భద్రత అధికారి విక్రమ్ తనిఖీ చేశారు. చికెన్ కూరలు, ఫ్రైడ్ రైస్ తయారీలో అనుమతిలేని కృత్రిమ రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం, సిబ్బంది తల కవర్లు, గ్లౌజులు, ఏప్రాన్లు ధరించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. సుమారు 15 కిలోల నిల్వ ఆహారాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేసి, నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ చట్టం సెక్షన్ 32 ప్రకారం నోటీసు జారీ చేశారు. Video 👇


అలాగే ఎస్ఎస్ఎస్ టిఫిన్ సెంటర్‌లో కూడా పరిశుభ్రత లోపాలను గుర్తించి మెరుగుదల నోటీసు ఇచ్చి నమూనాలు సేకరించారు.

ఈ సందర్భంగా అధికారి విక్రమ్ మాట్లాడుతూ హోటళ్ల నిర్వాహకులు ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ రంగులు వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక రంగులు కలిపిన ఆకర్షణీయ ఆహారాన్ని తీసుకోవద్దని ప్రజలకు సూచించారు.




Post a Comment

أحدث أقدم