నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి - మున్సిపల్ కమిషనర్
బాన్సువాడ పట్టణంలో ప్రతిరోజూ సక్రమంగా తాగునీరు అందించాలి - వాటర్ సప్లై సిబ్బందికి ఆదేశం
లీకేజీలపై తక్షణ మరమ్మతులు, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - కమిషనర్ సూచనలు
బాన్సువాడ, నవంబర్ 2: బాన్సువాడ పట్టణ ప్రజలకు ప్రతిరోజూ నిరంతరాయంగా, సక్రమంగా తాగునీటి సరఫరా అందించేందుకు నీటి సరఫరా విభాగం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.
ఈ మేరకు సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అన్ని వార్డులకు నిర్ణీత సమయానికి నీటి
సరఫరా జరిగేలా చూడాలని, పైపులైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
మోటార్లు, పంప్ హౌస్లు, వాల్వులను నిరంతరం పర్యవేక్షించాలని, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, నీటిని పొదుపుగా వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.




إرسال تعليق