ఢిల్లీలో ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ర్యాలీలో బాన్సువాడ కాంగ్రెస్ దళం
రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ -పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది తరలింపు
ఓటర్ల జాబితా SIRలో అక్రమాలపై నిరసన - ఈసీ పారదర్శకత, ప్రధాన కమిషనర్ రాజీనామా డిమాండ్
బాన్సువాడ, నవంబర్ 1: ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ భారీ బహిరంగ సభకు బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ నుంచి సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు.
ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి పార్టీల జాతీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





إرسال تعليق