POCSO Case Judgement |పోక్సో కేసులో చారిత్రాత్మక తీర్పు: నిందితుడికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పోక్సో కేసులో చారిత్రాత్మక తీర్పు: నిందితుడికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

9 ఏళ్ల బాలికపై దాడి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు

పకడ్బందీ దర్యాప్తు చేసిన పోలీసులను అభినందించిన ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, నవంబర్ 6: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ గౌరవ జిల్లా న్యాయమూర్తి ముక్తిదా నిర్ణయం తీసుకున్నారు.

కేసు పూర్వాపరాలు:

2022 జూన్ 12న జరిగిన ఈ దారుణ ఘటనలో 9 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన తండ్రి సాయంత్రం ఇంటికి తిరిగిరాగా, తీవ్రమైన కడుపునొప్పితో రోదిస్తున్న కుమార్తెను గమనించాడు. అనుమానంతో విచారించగా, గ్రామానికి చెందిన మంగళి చిన్న గంగాధర్ (49) చాక్లెట్ ఆశ చూపి, మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. తండ్రి ఇచ్చిన ఆధారాల మేరకు తాడ్వాయి పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

విచారణ & సాక్ష్యాధారాల సమర్పణ:

కేసు తీవ్రతను దృష్ట్యా పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు నిర్వహించారు. నిందితుడు మంగళి చిన్న గంగాధర్‌ను వెంటనే అరెస్టు చేసి, క్షేత్రస్థాయి పరిశీలన, వైద్య నివేదికలు మరియు సాక్షుల వాంగ్మూలాలతో సహా బలమైన ఆధారాలను పకడ్బందీగా కోర్టులో ప్రవేశపెట్టారు.

సమర్పించిన ఆధారాలు,  విచారణను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి, నేరం రుజువు కావడంతో నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

దర్యాప్తు బృందానికి ఎస్పీ రాజేష్ చంద్ర అభినందనలు:

తీర్పుపై కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర స్పందిస్తూ — చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే ఏ నేరస్థుడైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ తీర్పు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. చిన్నారుల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు.

బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరిగేలా శ్రమించిన అప్పటి తాడ్వాయి ఎస్‌హెచ్‌ఓ అంజనేయులు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ నరేష్, డీఎస్పీ శ్రీనివాసరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ మనోజ్ఞ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ పండరి, కోర్టు కానిస్టేబుల్ దేవిచంద్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

నిందితుడు 


Post a Comment

أحدث أقدم