Police Raid | పేకాట స్థావరంపై బాన్సువాడ పోలీసుల మెరుపు దాడి – ముగ్గురు అరెస్ట్

పేకాట స్థావరంపై బాన్సువాడ పోలీసుల మెరుపు దాడి – ముగ్గురు అరెస్ట్

కొత్తబాది పరిధి సంతోష్ నగర్ సమీపంలో దాడి – రూ.3,200 నగదు, 2 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడొద్దు – సమాచారం ఇస్తే గోప్యత – బాన్సువాడ పోలీసుల విజ్ఞప్తి

బాన్సువాడ, నవంబర్ 3: కొత్తబాది గ్రామ పరిధిలోని సంతోష్ నగర్ సమీప బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో బాన్సువాడ పోలీసులు మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులు మాలోత్ చందర్, మేఘావత్ ప్రకాష్, దేవ్ సోత్ శ్రీహరి లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.3,200 నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ తెలిపారు. సెల్: 8712686167కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Post a Comment

أحدث أقدم