Police Sports | క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి - ఎస్పీ రాజేష్ చంద్ర

క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి - ఎస్పీ రాజేష్ చంద్ర

జోనల్ స్థాయి క్రికెట్ పోటీలకు కామారెడ్డి పోలీస్ జట్టు ఎంపిక - జెర్సీలు అందజేసిన ఎస్పీ

కామారెడ్డి, నవంబర్ 3: జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు, ఎంపిక ప్రక్రియలో పాల్గొననున్న కామారెడ్డి జిల్లా పోలీస్ క్రికెట్ జట్టు క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ క్రికెట్ జెర్సీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నిరంతరం పని ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు ఒత్తిడిని అధిగమించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

యువత మత్తు పదార్థాలు, ధూమపానానికి దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.

Post a Comment

أحدث أقدم