Basweshwara Jayanti | మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ

 


పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్లు  విక్టర్, మదన్ మోహన్

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు  విక్టర్,  మధు మోహన్  మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ, మహాత్మ బసవేశ్వరుడు (1134–1196) 12వ శతాబ్దానికి చెందిన గొప్ప భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి మరియు లింగాయత్ ధర్మ స్థాపకుడు అని పేర్కొన్నారు. కులవ్యవస్థ, లింగ వివక్షత మరియు మూఢనమ్మకాలపై పోరాడి, ‘అనుభవ మంటపం’ ద్వారా సమానత్వం, సత్యం మరియు శ్రమ గౌరవాన్ని ప్రచారం చేసిన మహనీయుడు అని వివరించారు.

‘కాయకವೇ కైలాస’ (కష్టపడి పనిచేయడమే కైలాసం) అనే సందేశంతో శారీరక శ్రమకు, నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అలాగే బహుజన సంఘాల నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ , బి.సి. అభివృద్ధి అధికారి జయరాజ్  సహాయ అభివృద్ధి అధికారి చక్రధర్  బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, బి.సి. నాయకులు నాగరాజు, లింగాయత్ సమాజ ప్రతినిధులు కపిల ప్రభాకర్ గారు మరియు ఇతర నాయకులు అశ్వక్, నరేష్,శాంతయ్య, స్వప్న, పవన్ తదితరులు, జిల్లా అధికారులు  పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post