"విద్య లేనిదే మనిషి జీవితానికి విలువ లేదు"

 

బాన్సువాడ మదరసా అయేషాలో వార్షికోత్సం

 - మౌలానా జమాల్ అల్-రహ్మాన్ హాజరు

[ఫోటో: బాన్సువాడ మదరసా ఐషా అస్లాహ్ అల్ బనాత్‌లో జరిగిన సాలానా జల్సాలో ప్రసంగిస్తున్న అమీర్-ఏ-షరియత్ మౌలానా షాహ్ మహమ్మద్ జమాల్ అల్-రహ్మాన్ సాహబ్. వేదికపై మౌలానా అహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అత్హర్ సాహబ్, ఇతర ప్రముఖులు]   (vedios👇👇👇)


తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: స్థానిక మదరసా ఐషా అస్లాహ్ అల్ బనాత్‌లో మంగళవారం వార్షికోత్సం, తక్‌మీల్ హిఫ్జ్ ఖురాన్ మజీద్, తఖ్‌సీం అస్నాద్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమీర్-ఏ-షరియత్ తెలంగాణ - ఆంధ్రప్రదేశ్, హజరత్ మౌలానా షాహ్ మహమ్మద్ జమాల్ అల్-రహ్మాన్ సాహబ్ దామత్ బరకాతుహుమ్ మాట్లాడుతూ, "మనిషి బతికి ఉన్నంత వరకే విలువ ఉంటుంది. ఆ తరువాత పనికి రాకుండా పోతుంది. ఇది అల్లా ఇచ్చిన జీవితం. మనిషికి విద్య ఎంతో అవసరం. జీవించడం కోసం విద్య, ఆ తరువాత ఇస్లామిక్ విద్య అవసరం ఉంది" అని అన్నారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు.

*కార్యక్రమ విశేషాలు:*

ఈ జల్సాలో 22 మంది ఆలిమాత్, 3 హాఫిజాత్ మరియు 8 తాలిబాత్ కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు సనద్ ఫరాగత్, ఇనామ్ తహ్నియత్ అందజేశారు. మదరస నిర్వాహకులు మౌలానా ఏజాజ్ మాట్లాడుతూ బాలికలకు విలువలతో కూడిన ఇస్లామిక్ విద్యతో పాటు టెన్త్, ఇంటర్ చదివిస్తున్నామని వివరించారు.

కార్యక్రమానికి జేరె సదారత్‌గా హజరత్ మౌలానా అహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అత్హర్ సాహబ్ వ్యవహరించారు.

*హాజరైన ప్రముఖులు:*

మెహమానాన్ ఏజాజీగా హజరత్ మౌలానా అబ్దుల్ రకీబ్ సాహబ్ ఖాస్మి, హజరత్ ముఫ్తీ ఒమర్ బిన్ ఐసీ సాహబ్ ఖాస్మి, హజరత్ హాఫిజ్ అబ్దుల్ కరీమ్ ఖాన్ సాహబ్ హాజరయ్యారు.

ఉలమా ఏ కిరామ్ ఈమాన్ అఫ్రోజ్ ఖితాబాత్‌తో జల్సా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళల కొరకు ప్రత్యేక పర్దా ఏర్పాట్లు చేశారు.



Post a Comment

Previous Post Next Post