Heat Intensity in TG | మూడు రోజులు ఎండలతో జాగ్రత్త!

తెలంగాణలో 3 రోజులు మాడు పగిలే ఎండలు

 ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఆరెంజ్ అలర్ట్ జారీ

(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)

తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అయితే నేటి నుంచి 3 రోజుల్లో మరింతగా భానుడి భగభగలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 3 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

ఈసారి వేసవి కాలంలో భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఎండల తాకిడి పెరుగుతోంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రతకు జనం బయటికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు బయట తిరగొద్దని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. సాధారణం కంటే అధికంగా ఎండలు ఉండటంతో జనం మధ్యాహ్నం పూటే బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు తెలంగాణ ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే వచ్చే 3 రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, ఖమ్మం, మెదక్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రానున్న 3 రోజులకు ఆరెంజ్‌ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో గరిష్ఠంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక బుధవారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నారాయణపేట, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. IMD అంచనా ప్రకారం *ఏప్రిల్-జూన్ మధ్య* తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు ఉంటాయి. *ఏప్రిల్ 22 వరకు* తీవ్రమైన ఎండలు కొనసాగుతాయి. మే నెలలో కూడా ఉష్ణోగ్రతలు *45°C* దాటే అవకాశం ఉందని  హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చే 7-10 రోజులు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

గురువారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వడగాల్పులు వీచే అవకాశం ఉన్న జిల్లాలకు ముందస్తుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం పూట అసలు బయటికి రావొద్దని హితవు పలికింది.


IMD హెచ్చరికలు

1. ఏప్రిల్ 10-13:రాష్ట్రవ్యాప్తంగా 2-3°C ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని జిల్లాల్లో *44°C* నమోదైంది.

2. ఏప్రిల్ 12-22:"POWERFUL HEATWAVE" అలర్ట్. ఉత్తర, తూర్పు తెలంగాణలో 44°C దాటే అవకాశం హైదరాబాద్‌లో 10 రోజులు వరుసగా 40-41°C ఉంటుంది.

3. ఏప్రిల్ 14-18:ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో హీట్‌వేవ్.

4. ఆరెంజ్ అలర్ట్:ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 41-44°C ఉష్ణోగ్రతలు. 

జిల్లాల వారీగా తీవ్రత

👉రెడ్ జోన్ – 44-45°C: ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, వనపర్తి. 

👉ఆరెంజ్ జోన్ – 40-42°C: కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట. 

👉యెల్లో జోన్ – 39-41°C: హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి. 

*కారణాలు*

1. *పశ్చిమ అలజడులు ఆగిపోవడం* వల్ల పొడి వాతావరణం స్థిరపడింది.

2. *ఎల్ నినో ప్రభావం* వల్ల సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు.

3. *పొడి గాలులు, స్పష్టమైన ఆకాశం* వల్ల సూర్యరశ్మి తీవ్రత పెరిగింది. 

*వాతావరణ శాఖ సూచనలు*

- *మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు* బయటకు వెళ్లొద్దు.

- నీరు, మజ్జిగ, ORS, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

- లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి.

- వృద్ధులు, పిల్లలు, బయట పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

- అత్యవసరమైతే *101* ఫైర్ లేదా *108* అంబులెన్స్‌కు కాల్ చేయాలి. 


Post a Comment

Previous Post Next Post