#ప్రారంభోత్సవానికి సిద్ధంగా జకోరా,చందూర్, చిన్తకుంట ఎత్తిపోతల పధకాలు
#7,975 ఎకరాలకు సాగు నీరు
# త్వరలో ప్రారంభం
# వచ్చే ఖరీఫ్ లో పంటల కోసం ప్రణాళిక
-మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, హైదరాబాద్:
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జకోరా, చందూర్,చింతకుంట ఎత్తిపోతల పధకాలు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయని, త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరితగతిన ఈ ఎత్తిపోతల పధకాలు పూర్తి కావడం తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు.
106.04 కోట్ల వ్యయం తో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకాలతో నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మొస్రా మండలాల పరిధిలోని 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు.
వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుండి జకోరా ,చందూర్,చింతకుంట ఎత్తిపోతల పధకాల ద్వారా నీటి పంపిణీ ఉంటుందని ఆయన వివరించారు.
ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన పంప్ హౌస్ లకు 2.93 మేఘావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని,తద్వారా నీటి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ ఎత్తిపోతల పథకాలతో ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్టీరికరించడంతో పాటు అదనంగా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడం చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించాలి అన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు.
ఇప్పటికే ఈ ఎత్తిపోతల పధకాలను ఎమ్మెల్యే పోచారం ట్రయిల్ రన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఈ పధకాలు ప్రారంభోత్సవం అయితే ధాన్యం దిగుబడి విశేష రీతిలో పెరగడంతో పాటు,పంటల భద్రత ఇనుమడింప చేస్తుందన్నారు
రైతుల అభ్యున్నతికి సాగునీటి విస్తరణకు కాంగ్రేస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందని త్వరలోనే ఈ పధకాలు ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

.jpeg)
Post a Comment