Old Students | 27 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు

 

తాడ్వాయి మండలం ఎర్రహోడ్‌లో శనివారం నిర్వహించిన 1998-1999 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, గురువులు. 

27 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు

తెలంగాణ డైలీ న్యూస్, తాడ్వాయి:

తాడ్వాయి మండలం ఎర్రహోడ్‌లో 1998-1999 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా జరిగింది. 

27 సంవత్సరాల తర్వాత తిరిగి ఒక్కచోట కలుసుకున్న విద్యార్థులు పాఠశాల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పరస్పరం పంచుకుంటూ స్నేహబంధాలను మరింత బలపరుచుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు తరచుగా నిర్వహించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాన్ని, ఐక్యతను చాటింది.

Post a Comment

Previous Post Next Post