కామారెడ్డిలో మీడియా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా కార్డుల అందజేత
2026-2028 సంవత్సరానికి తొలి విడత కార్డులు మంజూరు
కలెక్టర్ కు జర్నలిస్టుల సన్మానం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు 2026-2028 సంవత్సరానికి సంబంధించి మంజూరైన తొలి విడత మీడియా అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్, మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ ఆశిష్ సంగ్వాన్ అందజేశారు. అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి కమిటీ సభ్యులు, జర్నలిస్టులకు కార్డులను అందించి నూతన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారిణి, కన్వీనర్ బి.తిరుమల, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రజనీకాంత్, ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, సయ్యద్ కౌసర్ అలీ, పాత్రికేయ మిత్రులు హరీష్, శ్రీనివాస్ కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.



Post a Comment