BJP Counsillors | కామారెడ్డిలో కాంగ్రెస్, BRS ఒక్కటే: బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ

 


కామారెడ్డిలో కాంగ్రెస్, BRS ఒక్కటే: బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ  

కో-ఆప్షన్ ఎన్నికల్లో ములాఖత్ అయ్యాయని విమర్శ 

"జండాలు వేరు కానీ అజెండా ఒకటే" అంటూ మండిపాటు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల అనంతరం బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా 16 మంది బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ కో-ఆప్షన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, BRSల బంధం మరోసారి బట్టబయలైందని ఆరోపించారు. 

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సూచించిన పార్టీ బలపరిచిన అభ్యర్థులకు తాము 16 మంది కౌన్సిలర్లు ఓటు వేశామని తెలిపారు. అయితే కాంగ్రెస్, BRS పార్టీలు ములాఖత్ అయ్యి BRS ఒకటి, కాంగ్రెస్ మూడు చొప్పున పంచుకున్నాయని, తద్వారా "జండాలు వేరు కానీ అజెండా ఒకటే" అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.

చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలప్పుడు కూడా ఇదే తరహాలో వ్యవహరించారని, బయట మాత్రం BRS ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు నటిస్తోందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. కామారెడ్డి ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు.


Post a Comment

Previous Post Next Post