బీర్కూర్‌లో ఇళ్ల పట్టాల జాప్యం : వారం రోజుల్లో ఇవ్వకుంటే నిరాహార దీక్ష - లబ్ధిదారుల హెచ్చరిక
తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్: ప్రభుత్వం కట్టించిన ఇళ్లకు పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ లబ్ధిదారులు బీర్కూర్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వారం రోజుల్లో పట్టాలు పంపిణీ చేయకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
*లబ్ధిదారుల ఆవేదన:*
2019లో 16 ఇండ్లు, 2021లో 64 ఇండ్లు, 2023లో 42 ఇండ్లు మొత్తం 122 ఇళ్లను అప్పటి తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కట్టించి ఇచ్చింది. అయితే ఇళ్లు ఇచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు పట్టాలు పంపిణీ చేయలేదని లబ్ధిదారులు వాపోయారు.
పంపిణీ రోజు ముఖ్య అతిథిగా కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చారని, ఆ తర్వాత ప్రభుత్వం మారిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడుస్తున్నా పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు.
*అధికారులు మారినా ఫలితం శూన్యం:*
పట్టా సర్టిఫికెట్లు రెడీ అయి సంవత్సరాలు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవధిలో 3 మంది RDOలు, 4 మంది MROలు మారినా పట్టాల సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
సర్టిఫికెట్లు రెడీ అయినా పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు.
*డిమాండ్:*
వారం రోజుల్లో పట్టాలు పంపిణీ చేయాలని, లేకుంటే నిరాహార దీక్షకు దిగుతామని లబ్ధిదారులు స్పష్టం చేశారు.

Post a Comment