Top News

Formers Protest | లారీల కొరతతో రైతుల ఆందోళ


లారీల కొరతతో రైతుల ఆందోళన

భవానీపేట్ కొట్టాల వద్ద 5 గ్రామాల రైతుల ధర్నా 

తెలంగాణ డైలీ న్యూస్, లింగంపేట:

లింగంపేట మండలం భవానీపేట్, జల్లిపల్లి, రాంపూర్, మంభోజిపేట్, కొండాపూర్ గ్రామాల రైతులు లారీల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లులకు తరలించేందుకు లారీలు దొరక్కపోవడంతో పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో శనివారం రైతులు భవానీపేట్ కొట్టాల వద్ద ధర్నా నిర్వహించారు. లారీల సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని గ్రామాల రైతులు కోరుతున్నారు. లారీలు అందుబాటులోకి తెచ్చి ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.



Post a Comment

Previous Post Next Post