ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి: మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డిలో ఘనంగా కాంగ్రెస్ పీఏసీ, జిల్లా కార్యవర్గ సమావేశం
నూతన కార్యవర్గానికి బాధ్యతల అప్పగింత
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కీలకంగా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. నాయకత్వం అందరికీ అందుబాటులో ఉంటుందని, పార్టీ అభివృద్ధే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి: షబ్బీర్ అలీ
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా మరింత బలపరచాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని, అవకాశం రాని వారికి రాబోయే రోజుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.
సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: తోట లక్ష్మీకాంతారావు
మాజీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాలతో ఎదిగిన పార్టీ అని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమిష్టిగా పనిచేయాలని కోరారు.
ముఖ్య నేతల హాజరు
ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో నూతనంగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులకు ప్రమాణ స్వీకారం చేయించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. నియామక పత్రాలను అందజేసి పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఐరేనీ సందీప్, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసిలాల్, పల్లె రమేష్ గౌడ్, రాజా గౌడ్, అంకం కృష్ణారావు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, పాత రాజు, సుతారి రమేష్, భీమ్ రెడ్డి, యాదవ్ రెడ్డి, అనంత రెడ్డి, తిరుమల్ గౌడ్, సీడీసీ చైర్మన్ ఇర్షాద్, పండ్లరాజు, గంప ప్రసాద్, గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






Post a Comment