Police Transfers | పారదర్శకంగా పోలీసు బదిలీలు

పారదర్శకంగా పోలీసు బదిలీలు

కౌన్సిలింగ్ ద్వారా 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్  

పోలీస్ కార్యాలయంలో కౌన్సిలింగ్ 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: 

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చిన 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్‌లు కేటాయించారు.

ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు

ఎస్పీ స్వయంగా హెడ్ కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి విల్లింగ్ స్టేషన్లు, స్పౌస్ ఉద్యోగ స్థానం, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డును పరిగణనలోకి తీసుకుని బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. వారి పిల్లల విద్యాభ్యాసం గురించి కూడా ఆరా తీశారు.


నైతికతతో విధులు నిర్వహించాలి: ఎస్పీ

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పారదర్శక బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసాన్ని బలోపేతం చేయాలని సూచించారు. నైతిక విలువలు, సేవాభావంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు.

పాల్గొన్న అధికారులు

కొత్తగా పోస్టింగ్‌లు పొందిన హెడ్ కానిస్టేబుళ్లు అంకితభావంతో పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post