Prajavani | కామారెడ్డి ప్రజావాణిలో 138 దరఖాస్తులు స్వీకరణ

కామారెడ్డి ప్రజావాణిలో 138 దరఖాస్తులు స్వీకరణ

సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 138 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.  

నేరుగా అధికారులకు వినతులు  

ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు. భూ సమస్యలు, పింఛన్లు, ఉపాధి, ధాన్యం కొనుగోళ్లు, కుటుంబ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు ప్రజావాణిలో వచ్చాయి.  

సత్వర పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం  

ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్‌వీ గిరి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆర్డీవోలు, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post