ఈద్గా వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలన
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ముస్లిం సోదర సోదరీమణులకు, ప్రజలకు ఎస్పీ యం. రాజేష్ చంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలు సోదరభావంతో, శాంతియుతంగా పండుగ జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ప్రజలకు అభినందనలు తెలిపారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు ముస్లిం సోదరీమణులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన
పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రత, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రార్థనలకు వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలు, పార్కింగ్ వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన ప్రార్థనలు
జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారన్నారు. ముఖ్య ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద భారీ బందోబస్తుతో పాటు నిరంతర పెట్రోలింగ్ కొనసాగించామని వివరించారు.




Post a Comment