మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ రూరల్: హైదరాబాద్‌లో సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మైనారిటీ బోర్లం మాజీ సదర్ కుమారుని వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఏనుగు రవీందర్ రెడ్డికి ఆహ్వానపత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పట్లోల దేవేందర్ రెడ్డి, దేశాయిపేట సర్పంచ్ బొనికర్ ప్రకాష్ జ్యోతి, దురికి సర్పంచ్ నారా గౌడ్, మజీద్ కమిటీ మాజీ సదర్ దడిగే హైమద్, వార్డు సభ్యులు మహబూబ్, బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment