కల్కి చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం
రూ.27.60 లక్షలతో బుంగ మరమ్మత్తులు, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం
రైతులకు ఇబ్బంది లేకుండా వేగంగా పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే
బాన్సువాడ , తెలంగాణ డైలీ న్యూస్:
బాన్సువాడలోని కల్కి చెరువు బుంగ మరమ్మత్తు పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ బుంగ మరమ్మత్తు పనుల కోసం ప్రభుత్వం రూ. 27 లక్షల 60 వేలు మంజూరు చేసిందని తెలిపారు. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
భవిష్యత్తులో మళ్లీ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కల్కి చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నందున మరమ్మత్తులను వేగంగా పూర్తిచేసి నీటి వృధాను అరికట్టాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శ్రీచంద్, ఏఈ నితిన్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు మహ్మద్ ఏజాస్,ఎర్వల కృష్ణారెడ్డి, నార్ల సురేష్, బాబా, నార్ల రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.






إرسال تعليق