విద్యార్థినులకు డిగ్రీ పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
వైద్య రంగంలో సేవలందించాలని విద్యార్థులకు పిలుపు
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భారత్ గార్డెన్స్‌లో శనివారం BSc నర్సింగ్ కళాశాల బాన్సువాడ విద్యార్థినుల మొదటి గ్రాడ్యుయేషన్ డే & వీడ్కోలు సభ (VALETE & Graduation Ceremony) ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి BSc నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. (వీడియో 👇)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి సేవా దృక్పథంతో కూడుకున్నదని, ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందించాలని విద్యార్థినులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు నర్సుల పాత్ర కీలకమని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆనిప్రణతి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలి బ్యాచ్ విద్యార్థినుల గ్రాడ్యుయేషన్ పూర్తవడంతో కళాశాల ప్రాంగణంలో సందడి నెలకొంది.









إرسال تعليق