Top News

Suicide | కామారెడ్డిలో విషాదం.. చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం.. చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఎమ్మార్ కాలనీ వాసి అంకం క్రాంతి కుమార్ మృతి

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

కామారెడ్డి, జూన్ 11: కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో చర్చి వెనకాల ఉన్న పొదల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.  

మృతుని వివరాలు

మృతుడిని ఎమ్మార్ కాలనీ నివాసి అంకం క్రాంతి కుమార్ (సుమారు 40 సంవత్సరాలు) గా గుర్తించారు. క్రాంతి కుమార్‌కు భార్య లావణ్య, కుమార్తె సంయుక్త, కవల కుమారులు విఘ్నేష్, వినాయక్ ఉన్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు క్రాంతి కుమార్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిసింది. దీంతో అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు.  

ఈ ఘటనతో ఎమ్మార్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

Post a Comment

Previous Post Next Post