Train Accident | గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి పడి మృతి

గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి పడి మృతి  

బిక్నూర్ రైల్వే ట్రాక్ వద్ద ఘటన, మృతదేహం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచారు  

ఆనవాళ్లు తెలిసినవారు సంప్రదించండి: రైల్వే ఎస్సై లింబాద్రి, 87126 58614

 తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 18: బిక్నూర్ శ్రీ సిద్ధ రామేశ్వర టెంపుల్ సమీపంలోని రైల్వే ట్రాక్ కె.ఎం నంబర్ 529/9-8 వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈరోజు ఉదయం 11 గంటల కంటే ముందు ఏదో రైలు నుంచి కింద పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

గాయాల వివరాలు  

మృతుడికి తలకు బలమైన రక్త గాయమైంది. వీపు, కడుపుపై కంకర రాళ్లు కుచ్చుకోవడంతో చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మృతుని వద్ద ఎలాంటి ఐడీ ప్రూఫ్ లభించలేదని రైల్వే పోలీసులు తెలిపారు.

మృతుని ఆనవాళ్లు 

- ఎత్తు: సుమారు 5 అడుగుల 6 అంగుళాలు  

- వయస్సు: 30 నుంచి 35 సంవత్సరాలు  

- రంగు: చామన ఛాయ, గడ్డం ఉంది. వెంట్రుకలు, గడ్డం నల్లగా ఉన్నాయి. ముఖం గుండ్రంగా ఉంది  

- ధరించిన దుస్తులు: బ్లాక్ కలర్ వైట్ చెక్స్ షర్టు. కాలర్‌పై “కుమార్ ప్రీమియం షర్ట్స్, మేడ్ ఇన్ ఇండియా, సైజ్ 40 CM” అని ఉంది. వైట్ కలర్ హాఫ్ హ్యాండ్ బనియన్, బ్లూ కలర్ ఫుల్ డ్రాయర్, బూడిద కలర్ ప్యాంటు, బ్లాక్ కలర్ బెల్ట్  

- ఇతర గుర్తులు: కుడి చేతికి స్టీల్ కడియం, కుడి చేతిపై లవ్ సింబల్ పచ్చబొట్టు, ఛాతిపై పుట్టుమచ్చ  

మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో ఫ్రీజర్‌లో భద్రపరచినట్లు రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపారు. మృతుని గురించి సమాచారం తెలిసినవారు రైల్వే ఎస్సై కామారెడ్డి లింబాద్రి, సెల్ నంబర్ 87126 58614 కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post