Top News

Banswada Muncipal Alert |బాన్సువాడలో వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అప్రమత్తం

బాన్సువాడలో వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అప్రమత్తం  

హెల్ప్ డెస్క్ ఏర్పాటు, ప్రజలకు జాగ్రత్తల సూచన

పట్టణంలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ 

బాన్సువాడ, జూలై 29: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాన్సువాడ పురపాలక సంఘం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కమీషనర్ శ గోపు గంగాధర్ తెలిపారు.

వర్షాలకు సంబంధించిన సమస్యలు, నీటి సరఫరా, లాగునీటి సమస్య, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర అత్యవసర పౌర సేవలపై ఫిర్యాదులు, వినతులు ఉంటే ప్రజలు నేరుగా హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని సూచించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరగా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

సంప్రదించాల్సిన నంబర్లు:

- నీటి సరఫరా, వీధి దీపాల కోసం: ఏఈ జగన్ మోహన్ రెడ్డి - 9963583010, రవీందర్ రెడ్డి - 7989515252, సాయి కిరణ్ - 9553896322

- పారిశుధ్యం కోసం: డి. రవి - 9676123007, పి. హనుమంతు - 7386093132, జి. సతీష్ - 7386188454

అదే సమయంలో పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న, కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలు వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాలకు లేదా బంధువుల ఇళ్లకు తాత్కాలికంగా తరలివెళ్లాలని కమీషనర్ సూచించారు. అయన పట్టణంలో పర్యటించారు.

ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ వెంట కార్యాలయ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వీడియో 👇





Post a Comment

أحدث أقدم