బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్ జాతీయ రహదారిపై ధర్నా
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాన్సువాడలోని నసురుల్లాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారో నిర్వహించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. (వీడియో 👇)
ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ, నిన్న సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయమని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ నుండి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురాలేదని ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్, కేటీఆర్ , హరీష్ రావు ను తప్పుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలే వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గుడిసెల నరసింహ గౌడ్, టేకుర్ల సాయిలు, మొగులయ్య, శ్రీనివాస్ రాజు, భాస్కర్, అత్తరు భూమయ్య, వెంకట్, బాబు, శేఖర్, సాయిలు, శ్రీనివాస్ గౌడ్, కుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment