Top News

Dont Drink Tap Water | కుళాయి నీటిని తాగడానికి వాడొద్దు

కుళాయి నీటిని తాగడానికి వాడొద్దు - జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన

శుభ్రమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కౌన్సిలర్ హకీం విజ్ఞప్తి

బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని 3వ వార్డు కౌన్సిలర్ హకీం సూచించారు.

బాన్సువాడ ప్రజలకు ప్రస్తుతం మున్సిపాలిటీ కుళాయిల ద్వారా సింగూర్ డ్యామ్ నుండి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వర్షాల కారణంగా పలుచోట్ల పైపులు లీక్ అవ్వడంతో శుభ్రమైన నీరు సరఫరా కావడం లేదని కౌన్సిలర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కలుషిత నీటిని పౌరులు తాగడానికి వాడితే వారి ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. (కలుషిత నీటి వీడియో 👇)


అధికారులకు విజ్ఞప్తి: 

పౌరుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రజలకు శుభ్రమైన తాగునీటిని సరఫరా చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరత అధికారులకు కౌన్సిలర్ హకీం విజ్ఞప్తి చేశారు. లీక్ అవుతున్న పైపులను వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.

ప్రజలకు సూచనలు:

1. కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీటిని తాగడానికి ఉపయోగించవద్దు. ఇతర అవసరాలకు మాత్రమే వాడుకోవాలి.  

2. తాగునీటి కోసం మంచినీటి ప్లాంట్లు లేదా క్యాన్ల నీటిని వాడాలి.  

3. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.  

4. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారని కౌన్సిలర్ హకీం ఆశాభావం వ్యక్తం చేశారు.


*// ప్రతిక ప్రకటన //*
* బాన్సువాడ పట్టణ  ప్రజలకు త్రాగునీటి వినియోగంపై అత్యవసర సూచన.*

సింగూర్ నుండి సరఫరా అవుతున్న నీటి రంగు మారి వస్తున్నట్లు గమనించబడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, బాన్సువాడ పట్టణంలోని ప్రజలందరికీ ఈ క్రింది సూచనలను తెలియజేయవలసిందిగా మనవి.

ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటిని ఇంటి సాధారణ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. త్రాగునీటిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. మరో మూడు (3) రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు పట్టణ ప్రజలందరూ సహకరించి, ఈ సూచనలను తప్పనిసరిగా పాటించి, సురక్షితమైన త్రాగునీటినే వినియోగించవలసిందిగా మనవి.


కమీషనర్
పురపాలక సంఘం బాన్సువాడ

Post a Comment

أحدث أقدم